హస్త కళాకారుల చేయూతకు హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ పోర్టల్‌

దేశంలో హస్త కళాకారులకు చేయూత ఇచ్చేందుకు, చేతివృత్తుల రంగం బలోపేతానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘మై ఇ-హాత్‌’ను ప్రారంభించినట్లు ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సామాజిక సేవా విభాగం హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది....

Published : 16 Aug 2021 01:14 IST

దిల్లీ: దేశంలో హస్త కళాకారులకు చేయూత ఇచ్చేందుకు, చేతివృత్తుల రంగం బలోపేతానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘మై ఇ-హాత్‌’ను ప్రారంభించినట్లు ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సామాజిక సేవా విభాగం హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. ప్రస్తుతం 8 రాష్ట్రాలకు చెందిన 30కి పైగా భాగస్వాములు 600 ఉత్పత్తులను ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది చివరికి దేశవ్యాప్తంగా మరింత మంది భాగస్వాములు చేరుతారని వెల్లడించింది. మై ఇ-హాత్‌ పోర్టల్‌ సాయంతో రాబోయే సంవత్సరాల్లో హస్త కళాకారులు వినియోగదారులకు నేరుగా విక్రయాలు జరపొచ్చని హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ నిధి పంధీర్‌ పేర్కొన్నారు. దేశంలో నైపుణ్యం కలిగిన కళాకారులను ప్రపంచం ముందుకు ఈ పోర్టల్‌ తీసుకెళ్తుందని, వారి గుర్తింపు, ఆదాయం, విలువ పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. భారీ సంఖ్యలో హస్త కళాకారులు, ప్రాథమిక ఉత్పత్తిదార్లకు వారధిగా నిలుస్తామని, నైపుణ్యాల శిక్షణ, మార్కెట్‌ మదింపు, సరఫరా వ్యవస్థ బలోపేతం వంటి అంశాల్లో కొరతను తీరుస్తామని ఫౌండేషన్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని