నట్లు బిగిస్తుంది..దుకాణం నుంచి సరకులూ తెస్తుంది

టెస్లా ఏఐ డే (కృత్రిమ మేధ రోజు) ప్రారంభం సందర్భంగా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తాము ఆవిష్కరించబోతున్న మరమనిషి (రోబో) బాట్‌ను పరిచయం

Published : 21 Aug 2021 02:31 IST

టెస్లా ‘హ్యుమనాయిడ్‌ రోబో’ బాట్‌

టెస్లా ఏఐ డే (కృత్రిమ మేధ రోజు) ప్రారంభం సందర్భంగా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తాము ఆవిష్కరించబోతున్న మరమనిషి (రోబో) బాట్‌ను పరిచయం చేశారు. ఇది ఒక హ్యుమనాయిడ్‌ (మానవరూప) రోబో. టెస్లాకు చెందిన వాహన కృత్రిమ మేధ ద్వారా ఇది పనిచేస్తుంది. పూర్తి స్వయం చోదిత కంప్యూటర్‌ అయిన ఇది, కెమెరాలు, ఇతర ఏఐలైన న్యూరల్‌ నెట్‌, వస్తువులను గుర్తించడం, అనుకరించడం వంటి పనులను ప్రభావితం చేస్తుంది. టెస్లా బాట్‌ 5.8 అడుగుల ఎత్తు, 56 కిలోల బరువు ఉంటుంది. 20 కిలోల బరువును తీసుకెళ్లగలదు. గరిష్ఠ వేగం గంటకు 5 మైళ్లు. ఇది తన చేతులతో 4 కిలోల బరువును ఎత్తగలదు.

రెంచ్‌తో బోల్టులను బిగించడం, దుకాణాల నుంచి సరకులు తీసుకురావడం వంటి షాపింగ్‌ పనులను కూడా చేయగలుగుతుందని ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. వచ్చే ఏడాదికి ప్రోటోటైప్‌ సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని