ఆధార్‌-పాన్‌, ఈపీఎఫ్‌ఓ అనుసంధానానికి ఇబ్బంది లేదు

అన్ని సేవలూ స్థిరంగానే: యూఐడీఏఐ

దిల్లీ: ఆధార్‌తో పాన్‌/ఈపీఎఫ్‌ఓ అనుసంధాన సదుపాయాల్లో ఎటువంటి అంతరాయం లేదని శనివారం యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) పేర్కొంది. అన్ని సేవలూ ‘స్థిరం’గా ఉన్నట్లు, సక్రమంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆధార్‌తో పాన్‌, ఈపీఎఫ్‌ఓల అనుసంధానంలో అంతరాయం కలుగుతోందన్న వార్తల మధ్య యూఐడీఏఐ పై విధంగా స్పందించింది. గత వారం రోజులుగా తమ వ్యవస్థల్లో అవసరమైన భద్రతాపరమైన మెరుగులు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో కొంత మేర సేవల్లో అంతరాయం కలిగింది. అది కూడా కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఎన్‌రోల్‌మెంట్‌, మొబైల్‌ నవీకరణ సేవల సదుపాయాల్లో ఇబ్బంది తలెత్తింది. ఇపుడు అవి సక్రమంగానే పనిచేస్తున్నాయ’ని యూఐడీఏఐ వివరించింది. ‘నవీకరణ మొదలైన గత తొమ్మిది రోజుల్లో 51 లక్షల మంది నమోదు చేసుకున్నారు. సగటున రోజుకు 5.68 లక్షలు సేవలందుకున్నార’ని తెలిపింది. కాబట్టి పాన్‌, ఈపీఎఫ్‌ఓతో ఆధార్‌ అనుసంధానంలో యూఐడీఏఐ వ్యవస్థలో అంతరాయం కలిగిందన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని