విపణిలోకి టాటా టిగోర్‌ విద్యుత్‌ వాహనాలు

టాటా మోటార్స్‌ తమ రెండో విద్యుత్‌ వాహనం టిగోర్‌ ఈవీలను మంగళవారం దేశీయ విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.11.99-13.14 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

Published : 01 Sep 2021 06:21 IST

ధరల శ్రేణి రూ.11.99-13.14 లక్షలు

దిల్లీ: టాటా మోటార్స్‌ తమ రెండో విద్యుత్‌ వాహనం టిగోర్‌ ఈవీలను మంగళవారం దేశీయ విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.11.99-13.14 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఈ మోడల్‌ 3 వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ధరలు వరుసగా రూ.11.99 లక్షలు, రూ.12.49 లక్షలు, రూ.12.99 లక్షలు. డ్యూయల్‌ టోన్‌ టాప్‌-ఎండ్‌ మోడల్‌ ధర రూ.13.14 లక్షలుగా ఉంది. 70 నగరాల్లోని 150 విక్రయశాలల నుంచి ఈ వాహనాలను డెలివరీ చేయనుంది. ఈ మోడల్‌కు అంతర్జాతీయ ఎన్‌క్యాప్‌ నుంచి 4-స్టార్‌ భద్రతా రేటింగ్‌ లభించడంతో సహా 306 కి.మీ రేంజ్‌తో ఏఆర్‌ఏఐ ధ్రువీకరణ కూడా లభించింది. కంపెనీ హై వోల్టేజ్‌ ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌ జిప్ట్రాన్‌ సాంకేతికతో ఈ మోడల్‌ రూపొందింది. సాంకేతికత, సౌకర్యం, భద్రత అనే మూడు ప్రధాన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్‌ను అభివృద్ధి చేశారు. 55 కిలోవాట్ల గరిష్ఠ సామర్థ్యం, 170 ఎన్‌ఎం టార్క్‌, 26 కిలోవాట్‌అవర్‌ లిక్విడ్‌-కూల్డ్‌, అధిక శక్తిమంత ఐపీ 67 రేటెడ్‌ బ్యాటరీ ప్యాక్‌ ఈ మోడల్‌ సొంతం. 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీ. వరకు బ్యాటరీ, మోటార్‌కు వారెంటీతో లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని