అగ్రశ్రేణి టెక్ కంపెనీల్లో
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ మరో కొత్త అంతర్జాతీయ పథకాన్ని తీసుకొచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) ముగింపు తేదీ ఈ నెల 11. ఈ ఓపెన్ ఎండెడ్ పథకంలో కనీస పెట్టుబడి రూ.1,000.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ మరో కొత్త అంతర్జాతీయ పథకాన్ని తీసుకొచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) ముగింపు తేదీ ఈ నెల 11. ఈ ఓపెన్ ఎండెడ్ పథకంలో కనీస పెట్టుబడి రూ.1,000.
ఈ పథకం కింద మదుపరుల నుంచి సమీకరించిన నిధులను నాస్డాక్ 100 ఇండెక్స్‌లో భాగంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలపై పెట్టుబడిగా పెడతారు. తద్వారా భారతీయ మదుపరులకు ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తున్నట్లు అవుతోంది. అంతేగాక డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం అయినప్పుడు ‘హెడ్జింగ్’ ప్రయోజనం మదుపరులకు లభిస్తుంది.
నాస్డాక్ 100 ఇండెక్స్‌లో యాపిల్‌కు అధిక వెయిటేజీ (11.35%) ఉంది. తదుపరి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, ఫేస్బుక్, టెస్లా, ఎన్విడియా, పేపాల్, ఆడోబ్ ఉన్నాయి.
‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్’ లో పెట్టుబడి పెడితే తమ పెట్టుబడిని మదుపరులు కేవలం మనదేశానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు కొంత పెట్టుబడిని కేటాయించినట్లు అవుతుంది. తద్వారా పోర్ట్‌ఫోలియో రిస్కును తగ్గించుకున్నట్లు అవుతుంది. గత రెండు దశాబ్దాల్లో నాస్డాక్- 100 ఇండెక్స్ నాలుగు రెట్లు పెరిగింది. అంతేగాక బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీతో పోల్చినప్పుడు నాస్డాక్ 100 ఇండెక్స్ పయనం కొంత సానుకూలంగా ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగనా సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్