కారు రుణం @ 7.50%
పండగల వేళ రుణాలు తీసుకునే వారికి ‘ఫెస్టివ్ ట్రీట్ 3.0’ పేరుతో ప్రత్యేక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించింది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, బ్రాండ్లతో ఒప్పందాలు....
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ఈనాడు, హైదరాబాద్: పండగల వేళ రుణాలు తీసుకునే వారికి ‘ఫెస్టివ్ ట్రీట్ 3.0’ పేరుతో ప్రత్యేక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించింది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఈ రాయితీలు అందిస్తున్నామని, రిటైల్ వినియోగదారుల నుంచి, వ్యాపారుల వరకు ఈ రాయితీలు పొందవచ్చని తెలిపింది. ప్రీమియం మొబైల్ ఫోన్లపై వడ్డీరహిత సులభ వాయిదాలు, నగదు వెనక్కి ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 22.5 శాతం వరకు నగదు వెనక్కి, వడ్డీ లేని వాయిదాల సౌకర్యం కల్పిస్తోంది. వీటితోపాటు 7.50 శాతం వడ్డీకే కారు రుణం పొందవచ్చని, వ్యవధికి ముందే రుణం చెల్లించినా ఎలాంటి రుసుములూ ఉండవని తెలిపింది. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 100 శాతం, ట్రాక్టర్లకు 90% రుణాన్ని అందించనుంది. హామీ అవసరం లేని వ్యాపార రుణాలను రూ.75 లక్షల వరకు అందిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రిటైల్ అసెట్ గ్రూప్ హెడ్ అరవింద్ కపిల్ తెలిపారు. మొత్తం 10వేలకు పైగా ఆఫర్లను పండుగల వేళ అందిస్తున్నట్లు డిజిటల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ పరాగ్ రావు చెప్పారు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
-
రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ
-
Vizag: ‘విశాఖ వందనం’ పేరుతో రాజధాని హడావుడి
-
Drugs Case: నటుడు నవదీప్ ఫోన్లలో డేటా మాయం!
-
Chandrababu: ‘బాబుతో నేను’.. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం
-
Chandrababu: హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం