వాహనం చేజారిపోతోంది..
మోటార్ బీమా రంగంలో ప్రభుత్వ కంపెనీలు శరవేగంగా మార్కెట్ వాటా కోల్పోతున్నాయి. ‘కరోనా’ మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నర కాలంగా మోటారు బీమా వ్యాపారం కుంగిపోగా, అందులోనూ ప్రభుత్వ బీమా...
మోటార్ బీమా రంగంలో వాటా కోల్పోతున్న ప్రభుత్వ కంపెనీలు
ముంబయి: మోటార్ బీమా రంగంలో ప్రభుత్వ కంపెనీలు శరవేగంగా మార్కెట్ వాటా కోల్పోతున్నాయి. ‘కరోనా’ మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నర కాలంగా మోటారు బీమా వ్యాపారం కుంగిపోగా, అందులోనూ ప్రభుత్వ బీమా కంపెనీల మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. మహమ్మారి ప్రభావం నుంచి మోటారు వాహనాల రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమేరకు మోటారు బీమా లోనూ వృద్ది కనిపిస్తోంది. కానీ ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల వాహన బీమా వ్యాపారం మాత్రం తగ్గిపోతోంది. ఈ విభాగంలో ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రభుత్వ బీమా కంపెనీల మార్కెట్ వాటా 32.6 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాదిలో ఇది 36.6 శాతం ఉండటం గమనార్హం. అదే సమయంలో ప్రైవేటు రంగ బీమా కంపెనీల వాటా 63.4 శాతం నుంచి 67.4 శాతానికి పెరిగింది.
మోటారు బీమాలో ప్రభుత్వ కంపెనీల వాటా క్షీణించటం ఈనాటి పరిణామం కాదు. 2018 నుంచే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీల వాటా 46.5 శాతం కాగా, ప్రైవేటు బీమా కంపెనీలకు 53.5 శాతం వాటా ఉండటం గమనార్హం. ఆ తర్వాత సంవత్సరానికి వచ్చే ప్రభుత్వ కంపెనీల వాటా 40.7 శాతానికి తగ్గిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 36.8 శాతానికి, 2021 ఆర్థిక సంవత్సరంలో 34.2 శాతానికి తగ్గింది. ఆ మేరకు ప్రైవేటు బీమా కంపెనీల వ్యాపారం పెరిగినట్లు ‘కేర్ రేటింగ్స్’ నివేదిక పేర్కొంది.
థర్డ్ పార్టీ మోటారు బీమాలో మొదటి నుంచీ ప్రభుత్వ రంగ కంపెనీల ఆధిపత్యం కనిపించేది. ఇప్పుడు అదీ పోతోంది. 2018లో థర్డ్ పార్టీ మోటారు బీమాలో ప్రభుత్వ కంపెనీలకు 52.7 శాతం వాటా ఉండగా. 2021 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 39.7 శాతానికి తగ్గిపోయింది. మోటారు బీమా వ్యాపారంలో వేగంగా విస్తరిస్తున్నది ‘థర్డ్ పార్టీ’ విభాగమే కావటం గమనార్హం.
పరిశ్రమ గణాంకాల ప్రకారం 2019 మార్చి నాటికి దేశంలో 23.12 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో 57 శాతం వాహనాలకు మోటారు బీమా లేదు. ద్విచక్ర వాహనాల్లో దాదాపు 60 శాతానికి మోటారు బీమా ఉండటం లేదు. అదే సమయంలో కార్లలో బీమా లేనివి 10 శాతానికి మించవు. ద్విచక్ర వాహనాల యజమానులు నాలుగైదేళ్లు వాహన బీమా తీసుకొని ఆ తర్వాత, బీమా ప్రీమియం చెల్లించటాన్ని భారంగా పరిగణిస్తారు. దీని ప్రకారం చూస్తే ద్విచక్ర వాహన బీమా పెద్ద వ్యాపారావకాశమనేది స్పష్టమవుతోంది. ద్విచక్ర వాహనదార్లను ఆకట్టుకునే రీతిలో పాలసీలు రూపొందించగలిగితే ఈ విభాగంలో అధిక వ్యాపారాన్ని సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం మోటారు బీమా వ్యాపారంలో మోటార్ ఓడి (ఓన్ డ్యామేజి) కంటే, మోటార్ టీపీ (థర్డ్ పార్టీ) పెద్ద వ్యాపార విభాగంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే మహరాష్ట్ర అతిపెద్ద మార్కెట్. తదుపరి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో... ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్, న్యూఇండియా, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!