PhonePe: రూ.50కి మించిన మొబైల్‌ రీఛార్జీలపై ఫోన్‌పే ప్రాసెసింగ్‌ రుసుము

వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే, ఫోన్‌ రీఛార్జులపై ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి

Updated : 23 Oct 2021 08:02 IST

దిల్లీ: వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే, ఫోన్‌ రీఛార్జులపై ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్‌ రుసుము భారం పడుతుంది. యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్‌ చెల్లింపుల సంస్థగా ఫోన్‌పే నిలవనుంది. పోటీ సంస్థలు ఈ లావాదేవీలపై ఛార్జి వసూలు చేయడం లేదు. ఇప్పటివరకు క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్‌పేతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రాసెసింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయి. రూ.50 లోపు ఫోన్‌ రీఛార్జీలపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్‌పే అధికార ప్రతినిధి వెల్లడించారు.
* థర్డ్‌ పార్టీ యాప్‌లలో అధిక లావాదేవీలను ఫోన్‌పే నిర్వహిస్తోంది. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను ఫోన్‌పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటా పొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని