జనవరి నుంచి వస్త్రాలపై 12 శాతం జీఎస్‌టీ

నూలు, వస్త్రాలు, మానవ తయారీ నార (ఎంఎంఎఫ్‌)పై ఒకే రీతిన 12% వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించే ఆదేశాలను ప్రభుత్వం నోటిఫై చేసింది.

Published : 22 Nov 2021 01:45 IST

దిల్లీ: నూలు, వస్త్రాలు, మానవ తయారీ నార (ఎంఎంఎఫ్‌)పై ఒకే రీతిన 12% వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించే ఆదేశాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రస్తుతం వస్త్రాలపై 5% జీఎస్‌టీ ఉండగా, వాటి తయారీకి వినియోగించే ఎంఎంఎఫ్‌పై 18%, నూలుపై 12% జీఎస్‌టీ ఉంది. జౌళిరంగంలోని ఈ పరిస్థితిని సరిదిద్దాలని సెప్టెంబరు 17న జీఎస్‌టీ మండలి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకనుకగుణంగా మొత్తం అన్నింటిపై జీఎస్‌టీని 12 శాతంగా నిర్థారిస్తూ, వచ్చే జనవరి 1 నుంచి అమలవుతుందని పేర్కొంటూ నోటిఫై చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని