పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో కార్లైల్‌ వాటా కొంటాం

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో కార్లైల్‌కు ఉన్న 32.2 శాతం వాటా కొనుగోలు చేస్తామని బేరింగ్‌ ఏసియా ఆఫర్‌ చేసింది. పీఎన్‌బీ హౌసింగ్‌లో నియంత్రణ వాటా కొనుగోలు చేసేందుకు కార్లైల్‌

Published : 27 Nov 2021 03:40 IST

బేరింగ్‌ ఏసియా ఆఫర్‌

దిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో కార్లైల్‌కు ఉన్న 32.2 శాతం వాటా కొనుగోలు చేస్తామని బేరింగ్‌ ఏసియా ఆఫర్‌ చేసింది. పీఎన్‌బీ హౌసింగ్‌లో నియంత్రణ వాటా కొనుగోలు చేసేందుకు కార్లైల్‌ గతంలో ప్రయత్నించి కార్పొరేట్‌ పాలన, వాల్యుయేషన్‌ (విలువ) సమస్యలతో విఫలమైన సంగతి తెలిసిందే.  పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో జనరల్‌ అట్లాంటిక్‌, ఎస్‌ఎస్‌జీ సంస్థలకు చెరో 10 శాతం మేర వాటాలున్నాయి. ఈ సంస్థలు కూడా తమ షేర్లను విక్రయిస్తే పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో నియంత్రణ వాటా బేరింగ్‌ ఏసియాకు దక్కే అవకాశాలున్నాయి. కార్లైల్‌, బేరింగ్‌ ఏసియా మధ్య వాటా విక్రయంపై చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ఫలప్రదమైతే వాటాదార్లకు కూడా బేరింగ్‌ ఏసియా ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించే అవకాశం ఉంది. అయితే కార్లైల్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బేరింగ్‌ ఏసియాలు ఈ విషయంలో స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని