ఎస్‌బీఐకు రూ.కోటి జరిమానా: ఆర్‌బీఐ

ముంబయి: నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు రూ.కోటి జరిమానా విధించినట్లు రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెల్లడించింది. 2018 మార్చి 31, 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి ఎస్‌బీఐ సూపర్‌వైజరీ ఎవాల్యుయేషన్‌ (ఐఎస్‌ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టిందని, నష్ట మదింపు నివేదికల్లో కొన్ని నిబంధనలు పాటించనందుకు ఎస్‌బీఐకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంక్‌ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకుని జరిమానా విధించారు.

హీరో బోర్డులో ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌: కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ చేరినట్లు హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది. మార్కెటింగ్‌ వ్యూహకర్త, వ్యాపారవేత్త వసుధ డినోడియా కూడా బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా నియమితులయ్యారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని