ఫ్యూచర్‌ రిటైల్‌ నుంచి రూ.7000 కోట్లు మళ్లించారు

ఫ్యూచర్‌ రిటైల్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేసే అంశంలో న్యాయపోరాటం చేస్తున్న అమెరికా రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా మరొకొన్ని ఆరోపణలు చేసింది. ఫ్యూచర్‌ రిటైల్‌ నుంచి ఇతర కంపెనీలకు

Published : 27 Nov 2021 03:40 IST

ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో అమెజాన్‌ ఆరోపణ

దిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేసే అంశంలో న్యాయపోరాటం చేస్తున్న అమెరికా రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా మరొకొన్ని ఆరోపణలు చేసింది. ఫ్యూచర్‌ రిటైల్‌ నుంచి ఇతర కంపెనీలకు భారీగా డబ్బులు మళ్లించారని.. దీనిపై దర్యాప్తు చేపట్టాలంటూ ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ గవర్నర్‌, సెబీ, ఇతర నియంత్రణ సంస్థలకు లేఖ రాసినట్లు ‘బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌’ తెలిపింది. మార్చి 2020తో ముగిసిన ఏడాదిలో ఫ్యూచర్‌ రిటైల్‌ రూ.7000 కోట్ల(939 మిలియన్‌ డాలర్లు)ను సంస్థ ప్రమోటర్‌ కిశోర్‌ బియానీకి చెందిన కంపెనీకి అడ్వాన్సుల రూపంలో ఇచ్చారని అమెజాన్‌ ఆరోపించిందని సమాచారం. ‘అదే ఏడాది అసాధారణరీతిలో అద్దె హామీ డిపాజిట్లను ఏర్పాటు చేసింది. సరఫరాదార్లకు రూ.4,300 కోట్ల వరకు అడ్వాన్సులు ఇచ్చింది. వ్యాపారం క్షీణిస్తూ, స్టోర్లను ఫ్యూచర్‌ రిటైల్‌ మూసివేసిన సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయ’ని అమెజాన్‌ వివరించింది. ఫ్యూచర్‌ రిటైల్‌ నుంచి ఎంచదగ్గరీతిలోనే నిధులు మళ్లించారు. ఇందులో కొంతమొత్తంతో అయినా బ్యాంకులు, రుణదాతలకు పాక్షికంగా బకాయిలు తీర్చి వ్యాపారం కొనసాగేలా చేసి ఉండొచ్చని పేర్కొంది.

అందులో కొత్తేమీ లేదు: ఫ్యూచర్‌ రిటైల్‌
‘అమెజాన్‌ పేర్కొన్న లావాదేవీలన్నీ ప్రజల ముందు ఉంచినవే. ప్రామాణిక పాలనా నిబంధనల్లో భాగంగా వాటన్నిటీ బయటకు వెల్లడించాం.చోటు చేసుకున్న అంశాల్లో కొంత భాగాన్నే తీసుకుని, అమెజాన్‌ అబద్ధపు ఆరోపణలు చేస్తోంద’ని ఫ్యూచర్‌ రిటైల్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అమెజాన్‌ ఇండియా ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని