సోఫ్రామైసిన్‌.. ఎన్‌క్యూబ్‌ సొంతం

చర్మ సంరక్షణ క్రీమ్‌ సోఫ్రామైసిన్‌తో పాటు ఇతర అనుబంధ బ్రాండ్లను సనోఫి గ్రూప్‌ నుంచి భారత్‌, శ్రీలంక విపణుల కోసం ఎన్‌క్యూబ్‌ ఎథికల్స్‌ రూ.125 కోట్లతో కొనుగోలు చేయనుంది. రెండు దశాబ్దాలుగా

Published : 27 Nov 2021 03:41 IST

సనోఫి నుంచి రూ.125 కోట్లకు కొనుగోలు

దిల్లీ: చర్మ సంరక్షణ క్రీమ్‌ సోఫ్రామైసిన్‌తో పాటు ఇతర అనుబంధ బ్రాండ్లను సనోఫి గ్రూప్‌ నుంచి భారత్‌, శ్రీలంక విపణుల కోసం ఎన్‌క్యూబ్‌ ఎథికల్స్‌ రూ.125 కోట్లతో కొనుగోలు చేయనుంది. రెండు దశాబ్దాలుగా సోఫ్రామైసిన్‌ను ఎన్‌క్యూబ్‌ తయారు చేస్తోంది. సోఫ్రామైసిన్‌, అనుబంధ బ్రాండులైన సోఫ్రాడెక్స్‌, సోఫ్రాకోర్ట్‌, సోఫ్రామైసిన్‌- టుల్లే కొనుగోలు నిమిత్తం సనోఫి గ్రూపుతో ఎన్‌క్యూబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ‘అంతర్జాతీయ సంస్థల కోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులను (ప్రిస్క్రిప్షన్‌, ఓవర్‌ ద కౌంటర్‌) ఎన్‌క్యూబ్‌ తయారు చేస్తోంది. సొంత లేబుల్డ్‌ ఉత్పత్తులతో భారత విపణుల్లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘23 ఏళ్లుగా చర్మ సంరక్షణ పరిశోధనలు, తయారీలో ఎన్‌క్యూబ్‌ నిమగ్నమైంది. సోఫ్రామైసిన్‌తో ప్రారంభించి పలు చర్మ సంరక్షణ బ్రాండ్లకు ఎన్‌క్యూబ్‌ కేంద్రంగా ఉండనుంద’ని సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ మెహుల్‌ షా తెలిపారు. వ్యూహాత్మక ప్రాధాన్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌క్యూబ్‌కు తమ బాండ్లను విక్రయించాలని నిర్ణయించామని సనోఫి ఇండియా ఎండీ రాజారామ్‌ నారాయణ్‌ తెలిపారు. ఈ లావాదేవీ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని