వీఎల్‌సీసీ ఐపీఓకు సెబీ అనుమతి

సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులు, సేవల సంస్థ వీఎల్‌సీసీ హెల్త్‌కేర్‌ పబ్లిక్‌ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. డిసెంబరు ఆఖరులో ఈ ఇష్యూ జరిగే వీలుంది. ఈ

Published : 27 Nov 2021 03:40 IST

దిల్లీ: సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులు, సేవల సంస్థ వీఎల్‌సీసీ హెల్త్‌కేర్‌ పబ్లిక్‌ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. డిసెంబరు ఆఖరులో ఈ ఇష్యూ జరిగే వీలుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో 89.22 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఓఎఫ్‌ఎస్‌లో ప్రమోటర్‌ ముకేశ్‌ లుథ్రా 18.83 లక్షల షేర్లను, ఓఐహెచ్‌ మారిషస్‌ 18.97 లక్షల షేర్లను, లియోన్‌ ఇంటర్నేషనల్‌ 52.42 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వందన లుథ్రా, ముకేశ్‌ లుథ్రాలకు కంపెనీలో వరుసగా 44.35 శాతం, 24.37 శాతం వాటాలున్నాయి. లియోన్‌ ఇంటర్నేషనల్‌కు 13.65 శాతం, ఓఐహెచ్‌ మారిషస్‌కు 5.04 శాతం వాటాలున్నాయి. ఐపీఓకు ముందు రూ.100 కోట్ల నిధుల్ని సమీకరించే ఉద్దేశంలో కంపెనీ ఉంది. ఇది పూర్తయితే తాజా ఇష్యూ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. 2021 మార్చి నాటికి 12 దేశాల్లోని 143 నగరాల్లో 310 కేంద్రాల ద్వారా కంపెనీ సేవలు అందిస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఈ పబ్లిక్‌ ఇష్యూకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. వీఎల్‌సీసీ 2015లోనే ఐపీఓకు వచ్చేందుకు ముసాయిదా పత్రాలు దాఖలు చేయగా, సెబీ అనుమతి ఇచ్చింది. అయితే అప్పట్లో ఐపీఓ ప్రణాళికను కంపెనీ విరమించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని