షేర్లు తనఖా పెట్టిన వేదాంతా ప్రమోటర్లు

వేదాంతాకు చెందిన ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు కంపెనీ షేర్లను తనఖా పెట్టడం ద్వారా 800 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6000 కోట్లు)ను సమీకరించాయి. ఆ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు

Published : 27 Nov 2021 03:41 IST

రూ.6,000 కోట్ల సమీకరణ

దిల్లీ: వేదాంతాకు చెందిన ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు కంపెనీ షేర్లను తనఖా పెట్టడం ద్వారా 800 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6000 కోట్లు)ను సమీకరించాయి. ఆ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించాయి. వేదాంతాలో 65.18 శాతం (242.26 కోట్ల) షేర్లను ఇవి తనఖా పెట్టాయి. మొత్తం మూడు ఆర్థిక ఒప్పందాల్లో తనఖా పెట్టాయి. తొలి ఒప్పందం కింద స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌(లండన్‌) నుంచి 400 మిలియన్‌ డాలర్లను పొందడం కోసం ట్విన్‌స్టార్‌ హోల్డింగ్స్‌ షేర్లు తనఖా పెట్టింది. రెండో ఒప్పందంలో వేదాంతా నెదర్లాండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ బీవీ కూడా అదే బ్యాంకు నుంచి 150 మిలియన్‌ డాలర్లను పొందింది. మూడో ఒప్పందం కింద స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌(హాంకాంగ్‌) నుంచి వేదాంతా రిసోర్సెస్‌ 250 మిలియన్‌ డాలర్లు పొందింది. కార్పొరేట్‌ నిర్మాణాన్ని మొత్తంగా మార్చే ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు నవంబరు 17న అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ఈ కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. విభజనలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై దృష్టి సారించడంతో పాటు అల్యూమినియం, ఇనుము, ఉక్కు; చమురు-గ్యాస్‌ విభాగాలను విడి కంపెనీలుగా నమోదు చేయాలనీ భావిస్తోంది. ఈ ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయడం కోసం డైరెక్టర్ల కమిటీని ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని