ఆన్‌లైన్‌లో ఆటో బుక్‌చేసుకుంటే 5% జీఎస్‌టీ

ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆటో రిక్షా సేవలను అందిస్తే 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 2022 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది

Updated : 27 Nov 2021 09:51 IST

జనవరి 1 నుంచి అమల్లోకి

దిల్లీ: ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆటో రిక్షా సేవలను అందిస్తే 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 2022 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం నవంబరు 18న విడుదల చేసిన నోటిఫికేషన్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆటో రిక్షా ప్రయాణ సేవలు అందించే సంస్థలకు జీఎస్‌టీ మినహాయింపును ఉపసంహరించకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే సాధారణ రీతిలో అందించే సేవలకు మాత్రం జీఎస్‌టీ మినహాయింపు ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని