రూ.2,200 కోట్లతో సెమీకండక్టర్‌ అసెంబ్లింగ్‌ ప్లాంటు

దేశంలో సెమీకండక్టర్ల కూర్పు (అసెంబ్లింగ్‌), పరీక్షా (టెస్ట్‌) ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో టాటా గ్రూపు ఉంది. ఇందుకోసం 300 మి.డాలర్ల (సుమారు రూ.2,200 కోట్లు) పెట్టుబడి పెట్టాలని

Published : 27 Nov 2021 03:50 IST

తెలంగాణ సహా 3 రాష్ట్రాలతో టాటాల సంప్రదింపులు
4,000 మందికి ఉద్యోగావకాశాలు

దిల్లీ: దేశంలో సెమీకండక్టర్ల కూర్పు (అసెంబ్లింగ్‌), పరీక్షా (టెస్ట్‌) ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో టాటా గ్రూపు ఉంది. ఇందుకోసం 300 మి.డాలర్ల (సుమారు రూ.2,200 కోట్లు) పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ప్లాంటు ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. అవుట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌ (ఓఎస్‌ఏటీ)గా వ్యవహరించే ఈ ప్లాంట్‌లో ‘ఫౌండ్రీలో తయారయ్యే సిలికాన్‌ వేఫర్లను’ అసెంబ్లింగ్‌ చేయడంతో పాటు పరీక్షించి, పూర్తి స్థాయి సెమీకండక్టర్ల చిప్‌లుగా మారుస్తారు. ప్లాంటు ఎక్కడ నెలకొల్పాలనే నిర్ణయం డిసెంబరులో ఖరారు కావచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి.  

* వచ్చే ఏడాది ఆఖరులో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలున్న ఈ ప్లాంటు వల్ల 4,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని