ఆస్ట్రాజెనెకా.. ‘కొవిడ్‌’ కాక్‌టెయిల్‌ మందు

స్ట్ర్టాజెనెకా ఫార్మా ఇండియా కొవిడ్‌-19 బాధితుల కోసం మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ మందును అందుబాటులోకి తీసుకురానుంది. రోగనిరోధక శక్తి క్షీణించిన రోగులు ఈ మందుతో కోలుకునే అవకాశం ఉందని ఆస్ట్ర్టాజెనెకా ఫార్మా ఇండియా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ అనిల్‌ కుక్రేజా తెలిపారు. టిగ్జాగెవిమ్యాబ్‌, సిల్గావిమ్యాబ్‌ ఔషధాలతో కూడిన ఈ కాక్‌టెయిల్‌ మందును (ఏజడ్‌డి7442) కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వ్యక్తుల కణజాలం నుంచి అభివృద్ధి చేశారు. కొవిడ్‌ వ్యాధిని నిరోధించడమే కాకుండా వ్యాధి సోకిన వారు త్వరగా కోలుకోడానికి వీలుకల్పించే మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధం ఇదొక్కటేనని ఆయన వెల్లడించారు. యూఎస్‌ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ తదితర ఔషధ నియంత్రణ సంస్థలు ఈ మందును సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థల నుంచి అనుమతి రాగానే, మనదేశంలో దీనికి అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని