ప్రమోటర్ల వాటా పరిమితి పెంపుపై అశోక్‌ హిందుజా హర్షం

ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితిని 26 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఐఐహెచ్‌ఎల్‌ మారిషస్‌ ఛైర్మన్‌ అశోక్‌ హిందుజా

Updated : 28 Nov 2021 02:05 IST

దిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితిని 26 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఐఐహెచ్‌ఎల్‌ మారిషస్‌ ఛైర్మన్‌ అశోక్‌ హిందుజా స్వాగతించారు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో హిందుజా గ్రూపు సంస్థ ఐఐహెచ్‌ఎల్‌ మారిషస్‌ ప్రమోటరుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో ఇంతకుముందున్న వాటా పరిమితైన 15 శాతం నుంచి  26 శాతానికి వాటాను పెంచుకునేందుకు     ఐఐహెచ్‌ఎల్‌ మారిషస్‌ ఇటీవలే ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకుంది. కోర్టు తీర్పు అనంతరం కోటక్‌ మహీంద్రా బ్యాంకులో ప్రమోటర్ల వాటా పరిమితి 26 శాతంగా కొనసాగించేందుకు ఆర్‌బీఐ అంగీకారం తెలపడంతో.. ఐఐహెచ్‌ఎల్‌ మారిషస్‌ కూడా తమకూ అనుమతినివ్వాలని అడిగింది. ‘ప్రమోటర్ల వాటా పరిమితి పెంపు నిర్ణయంతో నియంత్రణ సంస్థ, బ్యాంకులు, క్లయింట్లు.. ఇలా సంబంధిత అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ గణనీయ వృద్ధి దిశగా వెళ్తున్న ఈ తరుణంలో ఇది ఎంతో ముఖ్యమ’ని అశోక్‌ హిందుజా తెలిపారు. వాటా పరిమితి పెంపు నిర్ణయం అమలు దిశగా ప్రకటించే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని