ఎయిర్‌టెల్‌ డేటా కూపన్‌లు ఉపసంహరణ

దిల్లీ: కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్‌లపై యాప్‌ ద్వారా ఇస్తున్న డేటా ప్రయోజన కూపన్‌లను ఉపసంహరించుకున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. వివిధ ప్లాన్‌ల మధ్య వినియోగదారులకు అనిశ్చితి తొలగించేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని వెల్లడించింది. వివిధ ప్రీపెయిడ్‌ పథకాలపై 20-25 శాతం టారిఫ్‌లు పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఇటీవల ప్రకటించింది. వాయిస్‌ పథకాలు, అపరిమిత ప్లాన్‌లు, డేటా టాప్‌ అప్స్‌ వంటి పథకాల ధరలు శుక్రవారం నుంచి ప్రియమయ్యాయి. ఎంపిక చేసిన ప్యాక్‌లపై ప్రమోషనల్‌ కూపన్‌లకు 500 ఎంబీ అదనపు డేటా ప్రయోజనాలను మాత్రం కొనసాగిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. యాప్‌లపై రీఛార్జిలకు కూపన్‌తో అదనపు క్యాష్‌బ్యాక్‌, డేటా ఇవ్వడం ప్రస్తుతం నడుస్తోందని, అయితే వినియోగదారులకు అనిశ్చితి తొలగించేందుకు వెనక్కి తీసుకున్నట్లు ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని