రాగి ప్రతికూల ధోరణిలో!

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.48,909 కంటే పైన నిలదొక్కుకోకుంటే.. మరింతగా దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అయితే రూ.47,325 సమీపంలో మద్దతు

Published : 29 Nov 2021 01:53 IST

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.48,909 కంటే పైన నిలదొక్కుకోకుంటే.. మరింతగా దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అయితే రూ.47,325 సమీపంలో మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.46,990 వరకు దిగివస్తుందని భావించవచ్చు. ఒకవేళ    రూ.48,909 స్థాయిని అధిగమిస్తే రూ.49,823 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.14,545 కంటే పైన కదలాడకుంటే రూ.13,970; రూ.13,866 వరకు దిగిరావొచ్చు. ఈ నేపథ్యంలో రూ.14,524 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.14,424 సమీపంలో కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.


వెండి

వెండి మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.65,017 కంటే పైన కదలాడితే రూ.65,840; ఆ తర్వాత రూ.67,310 వరకు రాణిస్తుందని భావించవచ్చు.


ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ డిసెంబరు కాంట్రాక్టుకు ఈవారం రూ.17,085 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని    రూ.16,950 ఎగువన షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవడం మంచిదే.

* రాగి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.726 దిగువన ట్రేడయితే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. అయితే కాంట్రాక్టు పుంజుకునే అవకాశాలూ ఉన్నందున షార్ట్‌ సెల్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.747 వద్ద స్టాప్‌లాస్‌ను పెట్టుకోవడం తప్పనిసరి.

* సీసం డిసెంబరు కాంట్రాక్టును ఈవారం రూ.190 కంటే పైకి వెళ్లకుంటే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.186- 188 సమీపంలో కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.

* జింక్‌ డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.266 దిగువకు వస్తే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.274.35 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.271 దిగువన కాంట్రాక్టుకు షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. 

* అల్యూమినియం డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.213.55 కంటే పైకి వెళ్లకుంటే కొంత షార్ట్‌ సెల్లింగ్‌ చోటుచేసుకోవచ్చు. ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ షార్ట్‌ సెల్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపొచ్చు.

* నికెల్‌ డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,508 కంటే కిందకు దిగిరాకుంటే రూ.1,576 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.


ఇంధన రంగం

* సహజవాయువు డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.378 కంటే కిందకు దిగిరాకుంటే కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. రూ.381 వద్ద స్టాప్‌లాస్‌ను పెట్టుకొని రూ.395- 397 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవడం మంచిదే.

* ముడి చమురు డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.5,403 స్థాయిని అధిగమిస్తే మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుంది. రూ.5,537 వరకు వెళ్లొచ్చు. ఒకవేళ రూ.5,149 కంటే కిందకు వస్తే రూ.5,006కి దిగివస్తుందని భావించవచ్చు.

* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) డిసెంబరు కాంట్రాక్టుకు ఈవారం రూ.1,105 దిగువన మాత్రమే షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించాలి. ఒకవేళ కాంట్రాక్టు రూ.1,135 స్థాయిని అధిగమిస్తే రూ.1,165 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 1,040 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.1,075 లక్ష్యంతో రూ.1,052 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.8,274 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే రూ.7,448; రూ.7,260 వరకు దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంది.

* జీలకర్ర డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.16,337 కంటే పైకి వెళ్లకుంటే మరింతగా కిందకు దిగివచ్చే అవకాశం ఉంటుంది.

* పత్తి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.32,468 కంటే పైన నిలదొక్కుకోకుంటే రూ.31,615; రూ.31,070 లక్ష్యాలతో షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.


- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని