16 సహకార బ్యాంకుల డిపాజిటుదార్లకు నేడు రూ.5 లక్షల వరకు చెల్లింపు

దిల్లీ: ఒత్తిడిలో ఉన్న 16 సహకార బ్యాంకుల డిపాజిటుదార్లకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కింద నేడు రూ.5 లక్షల వరకు చెల్లించనున్నారు. కొత్త చట్టంలోని మార్గదర్శకాల మేరకు ఆర్‌బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) ఈ డబ్బులను ఇవ్వనుంది. అయితే ఇంతకుముందు 21 బ్యాంకులతో ఈ జాబితాను డీఐసీజీసీ సిద్ధం చేయగా.. ఇప్పుడు అందులో నుంచి 5 బ్యాంకుల పేర్లను తొలగించింది. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ కార్పొరేషన్‌ సవరణ బిల్లును ఆగస్టులో పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఏదేని బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించినప్పడు ఆ తేదీ నుంచి 90 రోజుల్లోగా డిపాజిటుదార్లకు రూ.5 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్టం సెప్టెంబరు 1, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే 90 రోజుల గడువు నవంబరు 29తో ముగుస్తుంది. ఇప్పటివరకు క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకొని డిపాజిటుదార్లు వాళ్ల బ్యాంకుకు వెళ్లి సంప్రదించాల్సిందిగా డీఐసీజీసీ సూచించింది.


సంక్షిప్తంగా

* కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) విచారణ జరుగుతుండగా బయటకు వచ్చి ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆరోపించింది.

* మాక్రోటెక్‌ డెవలపర్స్‌ ఐటీ నగరం బెంగళూరులో ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని రూ.3,000 కోట్ల ఈక్విటీ మూలధనం వెచ్చించనున్నట్లు తెలిపింది.

* విద్యుత్‌ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరం 7 నెలల్లో 291.72 మిలియన్‌ టన్నుల బొగ్గును పంపిణీ చేసినట్లు కోల్‌ ఇండియా వెల్లడించింది.

* అంతర్జాతీయ భాగస్వామితో కలిసి కంప్రెషర్ల తయారీ సంయుక్త సంస్థను (జేవీ) నెలకొల్పేందుకు టాటా గ్రూప్‌ సంస్థ వోల్టాస్‌ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది.

* నేషనల్‌ స్టీల్‌ అండ్‌ అగ్రో ఇండస్ట్రీస్‌ను ఏఆర్‌సీలు/ఎన్‌బీఎఫ్‌సీలు/ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు విక్రయించడం ద్వారా రూ.200 కోట్లు రికవరీ చేసుకోవాలని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ భావిస్తోంది.

* భవన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థ కామధేను గ్రూప్‌ తమ పెయింట్ల వ్యాపారాన్ని విడదీసిన తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో ప్రత్యేకంగా నమోదు చేయనుంది.


Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని