5జీ స్పెక్ట్రమ్‌ ధర సగానికి పైగా తగ్గించండి

ప్రభుత్వాన్ని కోరిన కాయ్‌

దిల్లీ: 5జీ సేవల కోసం ప్రతిపాదించిన స్పెక్ట్రమ్‌ వేలం కనీస ధర(బేస్‌ ప్రైస్‌)ను సగానికి పైగా తగ్గించాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాయ్‌) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదిలా ఉంటే, 2021 మార్చిలో నిర్వహించిన తొలి స్పెక్ట్రమ్‌ వేలంలో 7 బ్యాండ్లలో 2,308.80 మెగాహెర్ట్జ్‌ల వేలానికి సుమారు రూ.4 లక్షల కోట్ల రిజర్వ్‌ ధరను ప్రభుత్వం ఆఫర్‌ చేసింది. అయితే 700 మెగాహెర్ట్జ్‌, 2,500 మెగాహెర్ట్జ్‌ ప్రీమియం బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను విక్రయించలేకపోయింది. కనీస ధర అధికంగా ఉండటంతోనే బిడ్‌ వేసేందుకు ఏ సంస్థ కూడా ఆసక్తి చూపలేదు. 3.3-3.6 గిగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను అసలు వేలానికి ఉంచలేకపోయింది. ప్రతిపాదిత 5జీ స్పెక్ట్రమ్‌ వేలాన్ని 2022 ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాయ్‌లోని ఒక ప్రతినిధి 50-60 శాతం మేర కనీస ధరను తగ్గించాలని కోరుతుండగా, మరో టెలికాం సంస్థ సీనియర్‌ అధికారి ఏకంగా 60-70 శాతం ధరను తగ్గించాలని అభ్యర్థిస్తున్నారు. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ మాత్రం 3.3-3.6 గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ వేలానికి ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.492 కోట్ల కనీస ధరను నిర్ణయించాలని సిఫారసు చేస్తోంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని