Jio: ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా బాటలోనే జియో

ప్రముఖ టెలికాం సంస్థ జియో కూడా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా బాటలోనే నడిచింది. వచ్చే నెల 1 నుంచి ప్రీపెయిడ్‌ ఛార్జీలను 21 శాతం వరకు పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. టెలికాం

Updated : 29 Nov 2021 11:07 IST

డిసెంబరు 1 నుంచి ఛార్జీలు పెంపు

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ జియో కూడా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా బాటలోనే నడిచింది. వచ్చే నెల 1 నుంచి ప్రీపెయిడ్‌ ఛార్జీలను 21 శాతం వరకు పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఛార్జీలు పెంచుతున్నట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన ప్లాన్ల వివరాలను వెల్లడించింది.

* జియో ఫోన్‌ కోసం అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్లాన్‌ రూ.75కు బదులుగా ఇకపై రూ.91 చెల్లించాల్సి ఉంటుంది.

* రూ.199 ప్లాన్‌ (28 రోజులకు 1.5 జీబీ/రోజుకు) ధరను రూ.239కు, రూ.399 ప్లాన్‌ను (56 రోజులకు 1.5 జీబీ/రోజుకు) రూ.479కు, రూ.444 ప్లాన్‌ను (56 రోజులకు 2జీబీ/రోజుకు) రూ.533కు, రూ.555 ప్లాన్‌ను      (84 రోజులకు 1.5 జీబీ/రోజుకు) రూ.666కు సవరించింది.

* అదనపు డేటా ప్లాన్‌లను కూడా రూ.51 నుంచి 61కు (6 జీబీ), రూ.101 నుంచి 121కు (12 జీబీ), రూ.251 నుంచి రూ.301కు (50 జీబీ) పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు