2 ఐపీఓలు.. రూ.7,868 కోట్ల సమీకరణ

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌, టెగా ఇండస్ట్రీస్‌ల పబ్లిక్‌ ఇష్యూలు ఈవారంలో జరగనున్నాయి. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఈ రెండు కంపెనీలు మొత్తంగా రూ.7,868 కోట్లు

Published : 29 Nov 2021 06:18 IST

దిల్లీ: స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌, టెగా ఇండస్ట్రీస్‌ల పబ్లిక్‌ ఇష్యూలు ఈవారంలో జరగనున్నాయి. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఈ రెండు కంపెనీలు మొత్తంగా రూ.7,868 కోట్లు సమీకరించనున్నాయి. స్టార్‌ హెల్త్‌.. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ. ఇందులో వెస్ట్‌బ్రిడ్జ్‌ కేపిటల్‌, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు పెట్టుబడులు ఉన్నాయి. టెగా ఇండస్ట్రీస్‌.. ఖనిజ శుద్ధి ప్రక్రియ, గనుల తవ్వకం, బల్క్‌ సాలిడ్స్‌ హ్యాండ్లింగ్‌ పరిశ్రమకు అవసరమైన కీలక ఉత్పత్తుల తయారీ, పంపిణీని నిర్వహిస్తోంది. కాగా.. ఇప్పటికే నవంబరులో 10 కంపెనీలు విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూలను పూర్తి చేసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని