ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధిలో దిల్లీకి 39వ స్థానం

ప్రీమియం ఇళ్ల ధరల పెరుగుదలలో అంతర్జాతీయంగా దిల్లీ 39వ స్థానంలో నిలిచింది. నైట్‌ఫ్రాంక్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏప్రిల్‌-జూన్‌లో ఈ అంశంలో దిల్లీ 37వ స్థానంలో...

Published : 30 Nov 2021 02:05 IST

దిల్లీ: ప్రీమియం ఇళ్ల ధరల పెరుగుదలలో అంతర్జాతీయంగా దిల్లీ 39వ స్థానంలో నిలిచింది. నైట్‌ఫ్రాంక్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏప్రిల్‌-జూన్‌లో ఈ అంశంలో దిల్లీ 37వ స్థానంలో ఉండగా,  సెప్టెంబరు త్రైమాసికంలో రెండు స్థానాలు తగ్గి 39కి చేరింది. ముంబయి తన 40వ స్థానం నిలుపుకోగా.. బెంగళూరు 43వ ర్యాంకు నుంచి 42వ స్థానానికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 45కు పైగా నగరాలకు సంబంధించి ‘ప్రైమ్‌ గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ3 2021’ పేరుతో స్థానిక కరెన్సీ విలువ ప్రకారం ఇళ్ల ధరల పెరుగుదలను నైట్‌ఫ్రాంక్‌ పరిగణనలోనికి తీసుకుంది. మియామి 26.4 శాతం వృద్ధితో తొలి స్థానంలో నిలిచింది. జకార్తాలో ఇళ్ల ధరలు 4.2 శాతం క్షీణించి 46వ ర్యాంకుకు చేరింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే దిల్లీలో ధరలు స్థిరంగా ఉండగా.. ముంబయిలో 0.1శాతం క్షీణించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని