దివాలా ప్రక్రియకు రిలయన్స్‌ కేపిటల్‌

బోర్డును రద్దు చేసిన ఆర్‌బీఐ

 అడ్మినిస్ట్రేటర్‌ నియామకం

దిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) రిలయన్స్‌ కేపిటల్‌పై త్వరలోనే దివాలా పరిష్కార ప్రక్రియను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రారంభించనుంది. కంపెనీ బోర్డును కూడా సోమవారం రద్దు చేసింది. రుణ సంస్థలకు బకాయిలు చెల్లించడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. పరిపాలనాపరంగా నెలకొన్న తీవ్ర సమస్యలను బోర్డు సమర్థంగా పరిష్కరించలేకపోయిందని పేర్కొంది. రిలయన్స్‌ కేపిటల్‌కు అడ్మినిస్ట్రేటర్‌గా నాగేశ్వర రావు (బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌)ను నియమించింది. అడ్మినిస్ట్రేటర్‌నే దివాలా పరిష్కార వృత్తి నిపుణుడిగా నియమించాలని కోరుతూ ఎన్‌సీఎల్‌టీ (ముంబయి)కి కూడా ఆర్‌బీఐ దరఖాస్తు చేసుకోనుంది. ఆర్‌బీఐ దివాలా ప్రక్రియను చేపట్టబోతున్న మూడో దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ రిలయన్స్‌ కేపిటల్‌. ఇంతకుముందు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, శ్రేయీ గ్రూపు ఎన్‌బీఎఫ్‌సీలపై కూడా ఇదే తరహా చర్యలను ఆర్‌బీఐ తీసుకుంది. సెప్టెంబరులో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీకి రూ.40,000 కోట్ల ఏకీకృత అప్పు ఉందని వాటాదార్లకు రిలయన్స్‌ కేపిటల్‌ సమాచారం ఇచ్చింది.

స్వాగతించిన రిలయన్స్‌ కేపిటల్‌

దివాలా స్మృతి కింద రుణ పరిష్కార ప్రక్రియను ఆర్‌బీఐ చేపట్టడాన్ని రిలయన్స్‌ కేపిటల్‌ స్వాగతించింది. వాటాదార్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు ఆర్‌బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్‌కు పూర్తి స్థాయిలో సహకరిస్తామని పేర్కొంది. రుణాల చెల్లింపు కోసం గత రెండేళ్లలో తాము ఎన్ని విధాలా ప్రయత్నించినా కోర్టులు, రుణ పరిష్కార ట్రైబ్యునల్‌లో పలు కేసులు ఉండటంతో వీలు కాలేదని తెలిపింది. ఇప్పటికీ కంపెనీ వద్ద లాభదాయక, విలువైన వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది. ఆర్‌జీఐసీలో 100 శాతం, ఆర్‌ఎన్‌ఎల్‌ఐసీలో 51 శాతం వాటాను కలిగి ఉందని పేర్కొంది.


బ్రిటన్‌ టెలికాం కంపెనీని
కొనడం లేదు: ఆర్‌ఐఎల్‌
దిల్లీ: బ్రిటన్‌కు చెందిన టెలికాం గ్రూప్‌ బీటీని కొనుగోలు చేయడానికి ఎటువంటి ఆసక్తి లేదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) స్పష్టం చేసింది. ఈ విషయమై వెలువడిన వార్తలన్నీ ‘పూర్తిగా ఊహాజనితం, నిరాధారం’ అని బీఎస్‌ఈకి ఆర్‌ఐఎల్‌ సమాచారం ఇచ్చింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం విభాగమైన జియోకు సెప్టెంబరు 2021 నాటికి 42.48 కోట్ల మొబైల్‌ వినియోగదార్లున్నారు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా బాటలోనే ప్రీపెయిడ్‌ ఛార్జీలను 21 శాతం వరకు పెంచుతున్నట్లు ఆదివారం జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. సవరించిన ఛార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని