యూబీఐకి రూ.1 కోటి జరిమానా: ఆర్‌బీఐ

నిబంధనలను పాటింలేదనే కారణంపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)కు రూ.1 కోటి జరిమానాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధించింది. ‘రిజర్వ్‌ ...

Published : 30 Nov 2021 02:06 IST

దిల్లీ: నిబంధనలను పాటింలేదనే కారణంపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)కు రూ.1 కోటి జరిమానాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధించింది. ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఫ్రాడ్‌- క్లాసిఫికేషన్‌ అండ్‌ రిపోర్టింగ్‌ బై కమర్షియల్‌ బ్యాంక్స్‌ అండ్‌ సెలెక్ట్‌ ఎఫ్‌ఐస్‌’ మార్గదర్శకాలు 2016’, ‘గైడ్‌లైన్స్‌ ఆన్‌ సేల్‌ ఆఫ్‌ స్ట్రెస్డ్‌ అసెట్స్‌ బై బ్యాంక్స్‌’లో పొందుపరిచ్చిన కొన్ని నిబంధనలు, ఆదేశాలను యూబీఐ పాటించలేదంటూ నవంబరు 25 తేదీతో పంపిన ఆదేశాల్లో ఆర్‌బీఐ పేర్కొంది. ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ ఒక ఖాతాను రెడ్‌ ఫ్లాగ్‌ అకౌంట్‌గా వర్గీకరించడంలోనూ, వార్షిక  నివేదికలో సెక్యూరిటీ రిసీట్స్‌ కోసం చేసిన కేటాయింపుల వివరాలను పొందుపర్చడంలోనూ బ్యాంకు విఫలమైందని పేర్కొంది. నిబంధనలు పాటించనందునే ఈ జరిమానా విధించామని, వినియోగదార్లతో బ్యాంకు కుదుర్చుకున్న ఒప్పందం లేదా ఏదేని లావాదేవీని ప్రస్తావించాలనే ఉద్దేశంతో కాదని ఆర్‌బీఐ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని