ఎన్‌బీఎఫ్‌సీ రుణాల్లో 8-10% వృద్ధి

2022-23పై క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022-23) బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు) నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ 8-10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, కంపెనీల బ్యాలెన్స్‌ షీట్ల పటిష్ఠత ఇందుకు దోహదం చేస్తాయని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏయూఎంల్లో వృద్ధి 6-8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతంగా నమోదైంది. ఎన్‌బీఎఫ్‌సీల స్థూల నిరర్థక ఆస్తులు 25-300 బేసిస్‌ పాయింట్లు మేర పెరిగే అవకాశం ఉందని తన నివేదికలో క్రిసిల్‌ పేర్కొంది. కొత్త ఐఆర్‌ఏసీ (ఆదాయ గుర్తింపు, అసెట్‌ వర్గీకరణ, కేటాయింపులు) నిబంధనలు ఇందుకు కారణం అవుతాయని తెలిపింది. ఇటీవలి కాలంలో చాలా ఎన్‌బీఎఫ్‌సీలు నిధుల లభ్యత, మూలధన, కేటాయింపు నిల్వలను పెంచుకున్నాయని క్రిసిల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గురుప్రీత్‌ చత్వాల్‌ తెలిపారు. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుండటంతో.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సరైన స్థితిలో ఎన్‌బీఎఫ్‌సీలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో తక్కువ మొత్తం (రిటైల్‌) రుణాలకు పెరగొచ్చని, గిరాకీ పుంజుకోవడం ఇందుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. పసిడి తనఖా, ఇళ్ల కొనుగోలుకు, అన్‌సెక్యూర్డ్‌ రుణ విభాగాలు అత్యధిక వృద్ధి రేటు నమోదుచేస్తాయని తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని