జీవిత బీమా తొలి ప్రీమియంలో 14% వృద్ధి

దేశంలోని జీవిత బీమా సంస్థల తొలి బీమా ప్రీమియం వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో  14 శాతం వరకు వృద్ధి చెందే వీలుందని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. మొత్తం రూ.3.18 లక్షల కోట్ల మేరకు ఈ ప్రీమియం...

Published : 30 Nov 2021 02:06 IST

 రూ.3.18 లక్షల కోట్లకు చేరొచ్చు

ఈ ఆర్థిక సంవత్సరంపై ఇక్రా అంచనా

ముంబయి: దేశంలోని జీవిత బీమా సంస్థల తొలి బీమా ప్రీమియం వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో  14 శాతం వరకు వృద్ధి చెందే వీలుందని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. మొత్తం రూ.3.18 లక్షల కోట్ల మేరకు ఈ ప్రీమియం వసూళ్లు ఉండొచ్చని పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో తొలి బీమా ప్రీమియం వసూళ్లు 4 శాతం తగ్గి, రూ.1.53 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. కొవిడ్‌ నేపథ్యంలో విధించిన స్థానిక లాక్‌డౌన్ల ప్రభావమే ఇందుకు కారణమని ఇక్రా నివేదిక వెల్లడించింది.

దేశంలోని మొత్తం 16 జీవిత బీమా సంస్థల పనితీరు ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది. ఇందులో ఎల్‌ఐసీతోపాటు 15 ప్రైవేటు బీమా కంపెనీలున్నాయి. తొలి బీమా వ్యాపారంలో 98శాతాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో బీమా వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. ఏటా జనవరి-మార్చిలో బీమా పాలసీలకు అధిక గిరాకీ లభిస్తుండటమే ఈ అంచనాకు కారణమని ఇక్రా పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే.. బీమా పాలసీల విలువ అధికంగా ఉందని తేల్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని