యూనికార్న్‌గా మారిన స్లైస్‌

ఫిన్‌టెక్‌ అంకురం స్లైస్‌ సిరీస్‌ బి ఫండింగ్‌లో భాగంగా దాదాపు రూ.1,650 కోట్ల (220 మిలియన్‌ డాలర్ల) పెట్టుబడిని సమీకరించింది. దీంతో ఈ సంస్థ విలువ రూ.7,500 కోట్లకు (1 బిలియన్‌ డాలర్లు) చేరడంతో.. యూనికార్న్‌

Published : 30 Nov 2021 02:06 IST

రూ.1,650 కోట్ల పెట్టుబడి సమీకరణ

బెంగళూరు: ఫిన్‌టెక్‌ అంకురం స్లైస్‌ సిరీస్‌ బి ఫండింగ్‌లో భాగంగా దాదాపు రూ.1,650 కోట్ల (220 మిలియన్‌ డాలర్ల) పెట్టుబడిని సమీకరించింది. దీంతో ఈ సంస్థ విలువ రూ.7,500 కోట్లకు (1 బిలియన్‌ డాలర్లు) చేరడంతో.. యూనికార్న్‌ హోదా సాధించింది. న్యూయార్క్‌కు చెందిన టైగర్‌ గ్లోబల్‌, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ఇన్‌సైట్‌ పార్ట్‌నర్స్‌ ఈ పెట్టుబడులకు నేతృత్వం వహించగా అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌, సన్లీ హౌస్‌ క్యాపిటల్‌, మూరె స్ట్రాటెజిక్‌ వెంచర్స్‌ తదితర సంస్థలు పాల్గొన్నాయని స్లైస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా క్రెడిట్‌ స్కోరు లేని వారికి రుణాలు రావడం కొంచెం కష్టమే. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రీపెయిడ్‌ వీసా కార్డులను స్లైస్‌ అందిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజన్‌ బజాజ్‌ మాట్లాడుతూ.. స్లైస్‌ ప్రారంభించినప్పటి నుంచి స్థిరంగా అభివృద్ధి చెందేలా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా వచ్చిన పెట్టుబడులను చెల్లింపుల రంగంలో మరింత బలోపేతం అయ్యేందుకు వినియోగిస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని