రూ.75 లక్షల కోట్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

ప్రపంచంలోని అగ్రగామి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను తొలి 2 స్థానాల్లో నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. 2025 కల్లా లక్ష కోట్ల

Published : 30 Nov 2021 02:06 IST

ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌

దిల్లీ: ప్రపంచంలోని అగ్రగామి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను తొలి 2 స్థానాల్లో నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. 2025 కల్లా లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.75 లక్షల కోట్లు) డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవల్లో డిజిటలీకరణను వేగవంతం చేయడం సహా అస్పష్టతల్ని తొలగించి సమ్మిళిత అభివృద్ధికి వీలు కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో చట్టాల్ని రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన వివరించారు. ‘ఆజాదీ కా డిజిటల్‌ మహోత్సవ్‌’లో భాగంగా వచ్చే 25 ఏళ్లలో డిజిటల్‌ పరంగా భారత్‌ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో మంత్రి వివరించారు. కృత్రిమ మేధ, బ్లాక్‌ చైన్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ భద్రత వంటి అంశాల్లో మన దేశం ముందుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని