అమెజాన్‌కు మరో 2 వారాల సమయం

కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ముందు హాజరై, వాదనలు వినిపించడానికి ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు మరో రెండు వారాల సమయాన్ని సుప్రీం కోర్టు మంజూరు చేసింది. ఫ్యూచర్‌ కూపన్స్‌లో

Published : 30 Nov 2021 02:06 IST

ఆలోగా అభ్యంతరాలు చెప్పండి

 సీసీఐ కేసులో సుప్రీం కోర్టు

దిల్లీ: కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ముందు హాజరై, వాదనలు వినిపించడానికి ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు మరో రెండు వారాల సమయాన్ని సుప్రీం కోర్టు మంజూరు చేసింది. ఫ్యూచర్‌ కూపన్స్‌లో పెట్టుబడుల లావాదేవీకి సంబంధించి అమెజాన్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణను వాయిదా వేయడానికి సీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. కేసు పూర్వాపరాలను పరిశీలించదలుచుకోవడం లేదని, దిల్లీ హైకోర్టు ఇచ్చిన సమయం కంటే మరింత సమయాన్ని ఇవ్వాలని భావిస్తున్నట్లు.. తద్వారా సీసీఐ ముందు అమెజాన్‌ తన వాదన వినిపిస్తుందని ఆశిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలు ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని