కోటక్‌లో 10 శాతానికి పెరగనున్న ఎల్‌ఐసీ వాటా

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) వాటా దాదాపు 10 శాతానికి చేరనుంది. కోటక్‌ బ్యాంక్‌ చెల్లించిన వాటా మూలధనంలో 9.99 శాతానికి వాటాను పెంచుకునేందుకు

Published : 30 Nov 2021 02:06 IST

ఆర్‌బీఐ అనుమతి

దిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) వాటా దాదాపు 10 శాతానికి చేరనుంది. కోటక్‌ బ్యాంక్‌ చెల్లించిన వాటా మూలధనంలో 9.99 శాతానికి వాటాను పెంచుకునేందుకు ఎల్‌ఐసీకి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది. ఇదే విషయాన్ని ఎల్‌ఐసీ తమకు తెలియజేసిందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఓటింగ్‌ రైట్స్‌ లేదా షేర్ల కొనుగోలుకు సంబంధించి ముందస్తు అనుమతుల విషయంలో ఆర్‌బీఐ సూచనలకు లోబడి వాటాను ఎల్‌ఐసీ పెంచుకోవాల్సి ఉంటుంది. సెబీ నిబంధనలకు లోబడి  వ్యవహరించాల్సి ఉంటుంది. వాటా పెంపు నిమిత్తం ఆర్‌బీఐ ఇచ్చిన అనుమతి ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. బీఎస్‌ఈ వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. 2021 సెప్టెంబరు30 నాటికి ఎల్‌ఐసీకి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో  4.96 శాతం వాటా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని