బ్రిటిష్‌ ఏషియన్లు..వెనకేశారు బిలియన్లు

బ్రిటిష్‌ ఏషియన్ల సంయుక్త సంపద ఈ ఏడాది 20 శాతం అధికమై, దాదాపు 100 బిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.10 లక్షల కోట్లు) స్థాయికి చేరింది. కొవిడ్‌ పరిణామాలు, బ్రెగ్జిట్‌ విసిరిన సవాళ్ల నేపథ్యంలోనూ

Published : 30 Nov 2021 02:06 IST

 2021లో వీరి సంపదలో 20% వృద్ధి

ఏషియన్‌ రిచ్‌లిస్ట్‌ వెల్లడి

లండన్‌: బ్రిటిష్‌ ఏషియన్ల సంయుక్త సంపద ఈ ఏడాది 20 శాతం అధికమై, దాదాపు 100 బిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.10 లక్షల కోట్లు) స్థాయికి చేరింది. కొవిడ్‌ పరిణామాలు, బ్రెగ్జిట్‌ విసిరిన సవాళ్ల నేపథ్యంలోనూ బ్రిటన్‌లో ఆసియా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంపదను పెంచుకోగలగడం విశేషమేనని ఏటా వెలువడే ‘ఏషియన్‌ రిచ్‌ లిస్ట్‌’ పేర్కొంది. మొత్తం 101 మంది కుబేరులకు ఇందులో చోటు దక్కింది.  

ఏడో ఏడాదీ హిందుజా కుటుంబమే..: వరుసగా ఏడో ఏడాదీ హిందుజా కుటుంబమే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2.5 బిలియన్‌ పౌండ్ల (రూ.25,000 కోట్లు) మేర వీరి సంపద పెరిగింది. మిత్తల్‌ కుటుంబం అత్యధికంగా 4.8 బిలియన్‌ పౌండ్ల(రూ.48,000 కోట్లు) మేర సంపదను పెంచుకుని రెండో స్థానంలో కొనసాగింది. వీరి మొత్తం సంపద 14.2 బిలియన్‌ పౌండ్ల (రూ.1,42,000 కోట్లు)కు చేరుకుంది. గత 18 నెలల్లో ఆర్సెలర్‌ మిత్తల్‌ షేరు ధర 30 శాతం మేర పెరగడం ఇందుకు నేపథ్యం.  వేదాంతా అధిపతి అనిల్‌ అగర్వాల్‌ సంపదను 4.6 బిలియన్‌ పౌండ్లు(రూ.46,000 కోట్లు) పెంచుకోవడంతో మూడో స్థానంలో నిలిచారు. బ్రిటన్‌ నుంచి చోటు దక్కించుకున్న 15 మంది బిలియనీర్లలో అధికుల సంపద పెరగడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని