ఒమిక్రాన్‌ భయాలున్నా ముందుకే

సమీక్ష

జియో టారిఫ్‌ల పెంపుతో ఆర్‌ఐఎల్‌కు కొనుగోళ్ల మద్దతు

బ్యాంకింగ్‌, ఐటీ షేర్లకు లాభాలు

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ భయాలు కొనసాగుతున్నా మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో, సోమవారం సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకుని, లాభాల్లో ముగిశాయి. జియో టారిఫ్‌ల పెంపుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లకు మద్దతు లభించింది. బ్యాంకులు, ఐటీ స్క్రిప్‌లపై మదుపర్లు ఆసక్తి కనబర్చడంతో సెన్సెక్స్‌ 153 పాయింట్లు, నిఫ్టీ 28 పాయింట్ల మేర పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించినా, దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఈ రకం వైరస్‌ సోకిన వారిలో ఇప్పటి వరకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలపడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఆసియా మార్కెట్లలో నిక్కీ, షాంఘై, హాంగ్‌సెంగ్‌, కోస్పి సూచీలు డీలా పడ్డాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 18 పైసలు కోల్పోయి 5 వారాల కనిష్ఠ స్థాయి అయిన 75.07 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 57,028.04 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమై, 56,382.93 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆ దశలో పుంజుకుని 57,626.51 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 153.43 పాయింట్ల లాభంతో 57,260.58 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 27.50 పాయింట్లు లాభపడి 17,053.95 వద్ద స్థిరపడింది

సెన్సెక్స్‌ 30 షేర్లలో 13 లాభపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌ 2.92%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.25%, టీసీఎస్‌ 1.60%, టైటన్‌ 1.42%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.41%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.26%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.26% మేర పెరిగాయి. సన్‌ ఫార్మా 2.03%, ఎన్‌టీపీసీ 1.71%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.65%, నెస్లే ఇండియా 1.35%, బజాజ్‌ ఆటో 1.32%,   ఎస్‌బీఐ 1.24%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.16%, ఐటీసీ 1.14% చొప్పున నష్టపోయాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని