డిసెంబరులో 80-85 శాతం ఉత్పత్తి: మారుతీ

మారుతీ సుజుకీ కార్ల తయారీపై సెమీ కండక్టర్ల కొరత ప్రభావం వరుసగా ఐదో నెలా కొనసాగనుంది. ఎప్పుడూ తయారు చేసే పరిమాణంతో పోలిస్తే డిసెంబరులో 15-20% తక్కువగా .. అంటే సాధారణ స్థాయిలో 80-85% మేర

Published : 01 Dec 2021 01:47 IST

దిల్లీ: మారుతీ సుజుకీ కార్ల తయారీపై సెమీ కండక్టర్ల కొరత ప్రభావం వరుసగా ఐదో నెలా కొనసాగనుంది. ఎప్పుడూ తయారు చేసే పరిమాణంతో పోలిస్తే డిసెంబరులో 15-20% తక్కువగా .. అంటే సాధారణ స్థాయిలో 80-85% మేర కార్లు తయారు చేయగలమని కంపెనీ వెల్లడించింది. సెమీకండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ విడిభాగాల సరఫరాకు అవరోధాలు ఎదురవుతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఈ పరిణామం హరియాణా, గుజరాత్‌లోని కంపెనీ ప్లాంట్లలో తయారీపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మారుతీ సుజుకీ తెలియజేసింది.  

ఈకో వ్యాన్‌ రూ.8000 ప్రియం: ఈకో వ్యాన్‌ ధరను రూ.8,000 పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. కొత్తగా ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చడం వల్ల ధర పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. నవంబరు 30 నుంచి ఈ పెరిగిన ధర అమల్లోకి వచ్చిందని ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈకో వ్యాన్‌ ప్రయాణికుల రకం ధర రూ.4.3 - 5.6 లక్షల మధ్య ఉండగా.. అంబులెన్స్‌ రకం ధర రూ.7.29 లక్షలు (ఎక్స్‌షోరూం, దిల్లీ).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని