రిలయన్స్‌ క్యాపిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌కు  సలహా కమిటీ నియామకం

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ క్యాపిటల్‌ బోర్డును రద్దు చేసి, అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఒక రోజు వ్యవధిలోనే ముగ్గురు సభ్యులతో  సలహా కమిటీని సైతం

Updated : 01 Dec 2021 05:03 IST

ముంబయి: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ క్యాపిటల్‌ బోర్డును రద్దు చేసి, అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఒక రోజు వ్యవధిలోనే ముగ్గురు సభ్యులతో  సలహా కమిటీని సైతం నియమించింది. సంక్షోభంలో కూరుకుపోయిన ఈ ఎన్‌బీఎఫ్‌సీకి అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై.నాగేశ్వరరావుకు ఈ కమిటీ సలహాలు ఇవ్వనుంది. సలహా కమిటీలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ డీఎండీ సంజీవ్‌ నాతియాల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ మాజీ డీఎండీ శ్రీనివాసన్‌ వరదరాజన్‌, టాటా క్యాపిటల్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ, సీఈఓ ప్రవీణ్‌ పి.కాడ్లే ఉన్నారు. దివాలా స్మృతి (ఐబీసీ) ప్రకారం రిలయన్స్‌ క్యాపిటల్‌పై దివాలా ప్రక్రియను త్వరలోనే ఆర్‌బీఐ ప్రారంభించనుంది.

అనిల్‌ అంబానీ రాజీనామా: రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా చేశారు. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ సంస్థకు ప్రమోటర్‌, హోల్డింగ్‌ కంపెనీగా రిలయన్స్‌ క్యాపిటల్‌ ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం రిలయన్స్‌ క్యాపిటల్‌ బోర్డును ఆర్‌బీఐ రద్దు చేయడంతో అనిల్‌ అంబానీ రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని