17000 కిందకు నిఫ్టీ

సమీక్ష
సెన్సెక్స్‌ +900 నుంచి -196కు
వెంటాడిన ఒమిక్రాన్‌ భయాలు

మార్కెట్‌ను ఒమిక్రాన్‌ భయాలు వెంటాడటంతో ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆరంభంలో 900కు పైగా పాయింట్ల లాభాలు ఆర్జించిన సెన్సెక్స్‌, మదుపర్ల ఆందోళనలతో 196 పాయింట్ల నష్టంతో ముగిసింది. మూడు నెలల్లోనే తొలిసారిగా నిఫ్టీ 17000 పాయింట్ల దిగువకు చేరింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, బలహీన రూపాయి, విదేశీ మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 75.13 వద్ద ముగిసింది.  

సెన్సెక్స్‌ ఉదయం 57,272.08 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఆ తర్వాత దూకుడుగా కదలాడి ఇంట్రాడేలో 58,183.77 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఇక్కడ అమ్మకాలు వెల్లువెత్తడంతో, 56,867.51 పాయింట్లకు దిగివచ్చింది. చివరకు 195.71 పాయింట్ల నష్టంతో 57,064.87 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.75 పాయింట్లు తగ్గి 16,983.20 దగ్గర స్థిరపడింది.  

గో ఫ్యాషన్‌ షేరుకు రూ.638 లాభం.: గోఫ్యాషన్‌ షేర్లు అరంగేట్రంలోనే అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.690తో పోలిస్తే బీఎస్‌ఈలో 90.72% లాభంతో రూ.1316 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో 94.34% దూసుకెళ్లి రూ.1341 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 81.53% లాభంతో రూ.1252.60 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 నష్టపోయాయి. టాటా స్టీల్‌ 3.87%, కోటక్‌ బ్యాంక్‌ 2.87%, బజాజ్‌ ఆటో 1.72%, ఎం అండ్‌ ఎం 1.62%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.48%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.46%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.34%, మారుతీ 1.12% మేర డీలాపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ 3.43%, టైటన్‌ 2.18%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.98%, నెస్లే 1.33%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.27%, ఇన్ఫోసిస్‌ 1.04% లాభపడ్డాయి.

* స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ తొలి రోజు 12% స్పందన లభించింది. ఇష్యూలో 4,49,08,947 షేర్లు ఆఫర్‌ చేయగా.. 53,19,008 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

* ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌లోకి 7 కొత్త షేర్లు రానున్నట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. డిసెంబరు 31 నుంచి ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టుల్లో బలరామ్‌పూర్‌ చీనీ మిల్స్‌, గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌, హిందుస్థాన్‌ కాపర్‌, ఎన్‌బీసీసీ, రెయిన్‌ ఇండస్ట్రీస్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, టాటా కమ్యూనికేషన్స్‌ లభిస్తాయని తెలిపింది. మార్కెట్‌ లాట్‌, స్ట్రైక్స్‌, ఫ్రీజ్‌ లిమిట్‌ వంటి వివరాలను డిసెంబరు 30న వెల్లడించనున్నట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని