అక్టోబరులో కీలక రంగాల వృద్ధి 7.5%

ఈ ఏడాది అక్టోబరులో 8 కీలక రంగాల ఉత్పత్తి 7.5 శాతం మేర వృద్ధి చెందినట్లు వాణిజ్య, మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్‌ విభాగాలు ఆరోగ్యకర వృద్ధి నమోదు చేశాయి....

Published : 01 Dec 2021 01:48 IST

దిల్లీ: ఈ ఏడాది అక్టోబరులో 8 కీలక రంగాల ఉత్పత్తి 7.5 శాతం మేర వృద్ధి చెందినట్లు వాణిజ్య, మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్‌ విభాగాలు ఆరోగ్యకర వృద్ధి నమోదు చేశాయి. 2020 అక్టోబరులో 8 కీలకరంగాల ఉత్పత్తి 0.5% మేర క్షీణించింది. గత సెప్టెంబరులో కీలక రంగాల వృద్ధి 4.5 శాతంగా నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ 8 కీలక రంగాలకు 40.27 శాతం వాటా ఉంటుంది.

* 2020 అక్టోబరుతో పోలిస్తే గత నెలలో బొగ్గు 14.6 శాతం, సహజ వాయువు 25.8%, సిమెంట్‌ 14.5% రిఫైనరీ ఉత్పత్తులు 14.4% మేర వృద్ధి చెందాయి. ముడి చమురు ఉత్పత్తి 2.2 శాతం తగ్గింది. ఎరువులు, ఉక్కు, విద్యుదుత్పత్తి 0.04%, 0.9%, 2.8% చొప్పున క్షీణించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని