కార్గిల్‌ చేతికి కృష్ణపట్నం పోర్ట్‌ ఆయిల్‌ రిఫైనరీ

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరులో ఉన్న కృష్ణపట్నం పోర్ట్‌ ఆయిల్‌ రిఫైనరీని స్వాధీనం చేసుకున్నట్లు, పలు వ్యాపారాల్లో నిమగ్నమైన అమెరికా సంస్థ కార్గిల్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఈ వంటనూనెల శుద్ధి కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని...

Published : 01 Dec 2021 01:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరులో ఉన్న కృష్ణపట్నం పోర్ట్‌ ఆయిల్‌ రిఫైనరీని స్వాధీనం చేసుకున్నట్లు, పలు వ్యాపారాల్లో నిమగ్నమైన అమెరికా సంస్థ కార్గిల్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఈ వంటనూనెల శుద్ధి కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని, గణనీయంగా విస్తరించడంతో పాటు, ఆధునికీకరించేందుకు సుమారు రూ.260 కోట్లు (35 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. 70కి పైగా దేశాల్లో 1,55,000 పైగా ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ ఆహార పరిశ్రమ, వినియోగదారుల అవసరాల కోసం నేచర్‌ఫ్రెష్‌, జెమిని, స్వీకార్‌, రథ్‌, సన్‌ఫ్లవర్‌, లియొనార్డో తదితర బ్రాండ్లతో వంటనూనెలను ఉత్పత్తి చేస్తోంది. కొత్తగా స్వాధీనం చేసుకున్న కేంద్రం నుంచి రిఫైన్డ్‌ పామాయిల్‌, పామోలిన్‌, వనస్పతి, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ తదితరాలను 2022 మే నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు కార్గిల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ బిజినెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) పీయూష్‌ పట్నాయక్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో తమ సొంత ఆయిల్‌ బ్రాండ్లను విస్తరించేందుకు, ప్యాకేజింగ్‌ చేసుకునేందుకూ ఈ కేంద్రం తోడ్పడుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని