సాధారణ బీమా కంపెనీలవిలీన ప్రతిపాదన లేదు

రాజ్యసభకు తెలిపిన మంత్రి భగవత్‌ కె కరాడ్‌

దిల్లీ: ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా కంపెనీలను విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కె కరాడ్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో నాలుగు సాధారణ బీమా కంపెనీలు న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఉన్నాయి. ఇప్పటికైతే వీటిని విలీనం చేయాలని ప్రభుత్వం అనుకోవడం లేదని రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు.

* వివిధ ఆర్థిక సేవలను అందించడంలో బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ బ్లాక్‌చెయిన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐబీబీఐసీ)ను బ్యాంకులు ఏర్పాటు చేశాయని మంత్రి కరాడ్‌ తెలిపారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌లు కూడా ఐబీబీఐసీలో ఉంటాయని పేర్కొన్నారు. .

* ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారడం 2018-19 నుంచి పెరిగిందని మంత్రి చెప్పారు. 2018-19లో మొత్తం రుణాల్లో ఎన్‌పీఏలు 2.51 శాతంగా (రూ.17,712.63 కోట్లు) ఉన్నాయి. 2020-21లో ఇవి 3.61 శాతానికి (రూ.34,090.34 కోట్లు) పెరిగాయని ఆయన పేర్కొన్నారు. 2021 మార్చి 31 నాటికి 16.92 లక్షల ముద్రా కార్డులు జారీ చేశారని మంత్రి తెలిపారు.

* జీఎస్‌టీ అమలు కారణంగా రాష్ట్రాలకు ఆదాయ నష్టం వాటిల్లుతున్న దృష్ట్యా, ఐదేళ్లపాటు వాటికి పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు. 2020-21; 2021-22 ఆర్థిక సంవత్సరాలకు గాను రాష్ట్రాలకు వరుసగా రూ.37,134 కోట్లు, రూ.14,664 కోట్లు మేర ఇంకా విడుదల చేయాల్సి ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా నిర్మల తెలిపారు.

* 2020 డిసెంబరు 31 నాటికి బ్యాంకుల్లో (సహకార బ్యాంకులతో కలిపి) కొన్నాళ్లుగా వాడకుండా ఉన్న ఖాతాల్లో సుమారు రూ.26,697 కోట్లు ఉన్నాయని రాజ్యసభకు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దాదాపు ఇలా 9 కోట్ల ఖాతాలు ఉన్నాయని, వీటిని పదేళ్లుగా వాడటం లేదని చెప్పారు.

* పోలీసులు, రాజకీయ నాయకులు.. ఇలా ప్రత్యేకంగా కొంత మందికి రుణాలివ్వకూడదంటూ బ్యాంకులకు అధికారిక ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయలేదని మంత్రి సీతారామన్‌ తెలిపారు. కేవైసీ,  రేటింగ్‌ వంటి అంశాల ఆధారంగా బ్యాంకులు విచక్షణపై రుణాలు ఇస్తుంటాయని మంత్రి పేర్కొన్నారు.


ఈ సమావేశాల్లోనే క్రిప్టో బిల్లు

క్రిప్టోకరెన్సీపై కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాజ్యసభకు ఆర్థిక మంత్రి తెలియజేశారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిన తర్వాత ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును పెడతామని తెలిపారు. డిజిటల్‌ కరెన్సీ విభాగంలో శరవేగంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లును రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని