Published : 02 Dec 2021 01:59 IST

ఎగుమతుల్లో 26 శాతం వృద్ధి

రికార్డు గరిష్ఠానికి వాణిజ్య లోటు

దిల్లీ: దేశీయ ఎగుమతులు నవంబరులో 26.49 శాతం వృద్ధి చెంది 29.88 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2.24 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇంజినీరింగ్‌, పెట్రోలియం, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాలు మంచి వృద్ధి నమోదుచేయడం కలిసొచ్చిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది నవంబరులో ఎగుమతులు 23.62 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 33.81 బిలియన్‌ డాలర్ల నుంచి 57.18 శాతం అధికమై 53.15 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.98 లక్షల కోట్లు)కు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు రికార్డు గరిష్ఠమైన 23.27 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.1,74,525 కోట్లు )గా నమోదైంది. 2020 నవంబరులో ఇది 10.19 బి.డా. మాత్రమే. అంతకు ముందు 2012 అక్టోబరులో వాణిజ్య లోటు అత్యధికంగా 20.2 బిలియన్‌ డాలర్లకు చేరింది.

* నవంబరులో పసిడి దిగుమతులు 8 శాతం పెరిగి 4.22 బిలియన్‌ డాలర్లకు, పెట్రోలియం ఉత్పత్తులు 145.3 శాతం పెరిగి 3.82 బి.డాలర్లకు చేరాయి.
* ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మధ్య ఎగుమతులు 262.46 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో నమోదైన 174.15 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇవి 50.71 శాతం ఎక్కువ. 2019 ఏప్రిల్‌-నవంబరులో నమోదైన 211.27 బి.డాలర్లతో పోల్చినా 24.29 శాతం అధికం.
* ఏప్రిల్‌-నవంబరులో దిగుమతులు 75.39 శాతం అధికమై 384.44 బి.డాలర్లకు చేరాయి. వాణిజ్యలోటు 121.98 బి.డాలర్లుగా ఉంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని