Published : 02 Dec 2021 02:00 IST

సంక్షిప్త వార్తలు

ఎగుమతుల్లో 26 శాతం వృద్ధి

రికార్డు గరిష్ఠానికి వాణిజ్య లోటు

దిల్లీ: దేశీయ ఎగుమతులు నవంబరులో 26.49 శాతం వృద్ధి చెంది 29.88 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2.24 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇంజినీరింగ్‌, పెట్రోలియం, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాలు మంచి వృద్ధి నమోదుచేయడం కలిసొచ్చిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది నవంబరులో ఎగుమతులు 23.62 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 33.81 బిలియన్‌ డాలర్ల నుంచి 57.18 శాతం అధికమై 53.15 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.98 లక్షల కోట్లు)కు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు రికార్డు గరిష్ఠమైన 23.27 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.1,74,525 కోట్లు )గా నమోదైంది.


సీబీఐసీ ఛైర్మన్‌గావివేక్‌ జోహ్రి బాధ్యతల స్వీకరణ

దిల్లీ: కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు(సీబీఐసీ) ఛైర్మన్‌గా సీనియర్‌ అధికారి వివేక్‌ జోహ్రి బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌, పరోక్ష పన్నులు) అధికారి అయిన జోహ్రి ఇప్పటికే బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. నవంబరు 30న ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన ఎం.అజిత్‌ కుమార్‌ స్థానంలో వివేక్‌ చేరారు. సీబీఐసీ ఛైర్మన్‌గా జోహ్రి నియామకానికి గత నెలలో ‘ద అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ద కేబినెట్‌’ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

 


వచ్చే సెప్టెంబరుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ  

దిల్లీ: దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2022 సెప్టెంబరు వరకు సమయం ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సేవల ప్రారంభం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మొదటి ఏడాది దాదాపు రూ.900 కోట్ల అదనపు ఆదాయం రావొచ్చని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు ఏమీ లేవని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబరుకు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ల ఆస్తుల విలువ వరుసగా రూ.1,33,952 కోట్లు, రూ.3,556 కోట్లుగా ఉన్నాయి.


వాట్సాప్‌ ద్వారా ఐపీఓ దరఖాస్తులు: అప్‌స్టాక్స్‌

దిల్లీ: వాట్సాప్‌ ద్వారా వినియోగదారులు ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టేందుకు, డీమ్యాట్‌ ఖాతాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆన్‌లైన్‌ బ్రోకరేజీ సంస్థ అప్‌స్టాక్స్‌ వెల్లడించింది. వాట్సాప్‌ ద్వారా ఐపీఓ దరఖాస్తులు స్వీకరిస్తామని, వినియోగదారులు ఖాతా తెరిచే ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని అప్‌స్టాక్స్‌ తెలిపింది. అప్‌స్టాక్స్‌లో నమోదైనా లేకపోయినా, వాట్సాప్‌ చాట్‌ ద్వారా ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. తాజా ఫీచర్‌తో ఐపీఓ దరఖాస్తులు 5 రెట్లు అధికం కావొచ్చని సంస్థ అంచనా వేస్తోంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని