
షేర్లు కొనాలంటే.. ‘పాన్’ నమోదు చేయండి
పాలసీదారులకు ఎల్‌ఐసీ సూచన
దిల్లీ: త్వరలో ఐపీఓకి రాబోతున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), తన పాలసీదారులు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) వివరాలను సమర్పించాల్సిందిగా కోరింది. ఐపీఓలో ఎల్‌ఐసీ పాలసీదారులకు 10 శాతం షేర్లను సంస్థ ప్రత్యేకించనుంది. ఈ నేపథ్యంలో పాలసీదారులు తమ పాన్ వివరాలు తెలియజేయాల్సిందిగా సంస్థ సూచించింది. డీమ్యాట్ ఖాతా ద్వారా ఐపీఓకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అయితే, పాలసీదారుల పాన్ వివరాలు సంస్థ వద్దా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎల్‌ఐసీ వెల్లడించింది.కేవైసీ నిబంధనలు పాటించేందుకు పాన్ వివరాలు అవసరం అవుతాయని పేర్కొంది. పాన్‌ను ఎల్‌ఐసీ దగ్గర నమోదు చేసుకోవడంతో పాటు, సొంత ఖర్చుతో డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలని పాలసీదారులకు సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.