
10 నెలల గరిష్ఠానికి ‘తయారీ’
దిల్లీ: భారత తయారీ రంగ కార్యకలాపాలు మరింత బలోపేతమయ్యాయి. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడడంతో ఉత్పత్తి, విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) తెలిపింది. అక్టోబరులో 55.9గా ఉన్న పీఎమ్ఐ నవంబరులో 57.6కు చేరుకుంది. ఫిబ్రవరి తర్వాత నమోదైన అత్యధిక గణాంకాలివే. అదీ కాక దీర్ఘకాల సగటు అయిన 53.6 కంటే అధికంగా నమోదు కావడం గమనార్హం. మూడు నెలల పాటు ఉద్యోగాల్లో కోతల అనంతరం నియామకాలు పుంజుకున్న సంకేతాలు కనిపించాయి. పీఎమ్ఐ సంఖ్య 50కి పైన ఉంటే వృద్ధిగా.. కింద ఉంటే క్షీణతగా భావిస్తారన్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ వృద్ధి సైతం అంచనాల కంటే మెరుగ్గా 8.4 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.