కియా కొత్త కారు కారెన్స్ వచ్చే ఏడాదిలో విడుదల
భారతీయ విపణిలోకి మరో కారును ఆవిష్కరించేందుకు కియా ఇండియా సిద్ధం అవుతోంది. ఈ రిక్రియేషన్ వెహికిల్ (ఆర్వీ)ని ‘కారెన్స్’ పేరుతో తీసుకొస్తున్నట్లు బుధవారం సంస్థ తెలిపింది.
దిల్లీ: భారతీయ విపణిలోకి మరో కారును ఆవిష్కరించేందుకు కియా ఇండియా సిద్ధం అవుతోంది. ఈ రిక్రియేషన్ వెహికిల్ (ఆర్వీ)ని ‘కారెన్స్’ పేరుతో తీసుకొస్తున్నట్లు బుధవారం సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దీన్ని విడుదల చేస్తామని పేర్కొంది. కొత్త తరం భారతీయ కుటుంబాలకు నచ్చేలా ఒక సరికొత్త విభాగాన్ని కారెన్స్ ద్వారా పరిచయం చేయబోతున్నట్లు తెలిపింది. ‘కియా ఇండియా నుంచి వస్తున్న నాలుగో మోడల్ ఇది. భారతీయ పట్టణ జీవన శైలి, రోడ్ల పరిస్థితులను అర్థం చేసుకుని, ఈ ప్రీమియం, సౌకర్యవంతమైన ఆర్వీని ఆవిష్కరిస్తున్నాం. మూడు వరుసల సీట్లు ఉంటాయి. ‘కారెన్స్’ పలు కార్ల విభాగాలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా.. ఒక కీలక మలుపును తీసుకు రాబోతోంది’ అని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ టాయ్ జిన్ పార్క్ అన్నారు. ఈ కొత్త మోడల్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉన్న కియా కార్ల తయారీ కేంద్రం నుంచి రానుంది. డిసెంబరు 16న కారెన్స్‌ను ప్రదర్శించనున్నట్లు కియా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?