దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని పాటిద్దాం :ఫిక్కీ

కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ నియంత్రణకు దేశవ్యాప్తంగా ఒకటే తరహా విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని పరిశ్రమ సంఘం ఫిక్కీ సూచించింది. ముఖ్యంగా రాష్ట్రాలు, నగరాలు, పట్టణాల ప్రవేశాల వద్ద ఒకే పద్ధతి పాటించడం ఎంతో అవసరమని, ఇందులో ఏమాత్రం తేడాలున్నా

Published : 03 Dec 2021 01:33 IST

కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ నియంత్రణకు దేశవ్యాప్తంగా ఒకటే తరహా విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని పరిశ్రమ సంఘం ఫిక్కీ సూచించింది. ముఖ్యంగా రాష్ట్రాలు, నగరాలు, పట్టణాల ప్రవేశాల వద్ద ఒకే పద్ధతి పాటించడం ఎంతో అవసరమని, ఇందులో ఏమాత్రం తేడాలున్నా ఒకదాని ప్రభావం మరోదానిపై పడుతుందని అభిప్రాయపడింది. అప్రమత్తతతో వ్యవహరించడంతో పాటు, ఆర్‌టీ- పీసీఆర్‌ పరీక్షా కిట్‌లను మరింతగా సమకూర్చుకోవడం ముఖ్యమని పేర్కొంది. కొవిడ్‌ వైరస్‌ వేరియంట్ల పరిశీలన నిమిత్తం జెనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగ కేంద్రాలను కూడా పెంచాలని సూచించింది. కొవిడ్‌-19 ముప్పు పూర్తిగా తొలగలేదని చెప్పడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిదర్శనమని తెలిపింది. కొవిడ్‌-19 టీకా రెండు డోసులు వేసుకోవడం, మాస్క్‌ ధరించడం సహా పలు జాగ్రత్తలు పాటించడం ఇప్పుడు చాలా అవసరమని పేర్కొంది. లేనిపోని వదంతులతో ప్రజలను భయాందోళనలకు గురి చేసేందుకు, వారి జీవన విధానానికి అంతరాయాలు సృష్టించే పరిణామాలు చోటుచేసుకునేందుకూ ఆస్కారం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఫిక్కీ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు