ఓయోకు వ్యూహ సలహాదారుగాఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌

దిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ను తమ గ్రూప్‌ వ్యూహ సలహాదారుగా నియమించినట్లు ఓయో తెలిపింది. ఆర్థిక రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవమున్న రజనీశ్‌.. ఓయో యాజమాన్యానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు, నియంత్రణ పరమైన మార్గదర్శకాలు, అంతర్జాతీయంగా కంపెనీ బ్రాండు విశిష్ఠతను పెంచడం లాంటి అంశాలపై సలహాల్విడంలో కీలక పాత్ర పోషించనున్నారని కంపెనీ తెలిపింది. ‘డిజిటలీకరణ, సాంకేతికతకు సంబంధించిన అంశాల్లో రజనీశ్‌ అనుభవం ఎంతో ముఖ్యం కానుంది. మా వాటాదార్లకూ దీని వల్ల ప్రయోజనం కలుగుతుంద’ని ఓయో వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ రితేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం రజనీశ్‌ హెచ్‌ఎస్‌బీసీ ఆసియా పసిఫిక్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, హీరో మోటోకార్ప్‌, భారత్‌పే బోర్డుల్లో డైరెక్టరుగా ఉన్నారు.


మాజీ ఉద్యోగులపై కేసు వేయనున్న సిగ్నిటీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిగ్నిటీ టెక్నాలజీస్‌ తన మాజీ ఉద్యోగులు ప్రదీప్‌ గోవిందసామి, కల్యాణ రావు కొండాతో పాటు క్వాలిజిల్‌ ఇంక్‌ అనే సంస్థపై లాసూట్‌ దాఖలు చేయనుంది. తమ అమెరికా అనుబంధ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని, బుధవారం దృశ్యమాధ్యమ పద్ధతిలో జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఆమోదించారని ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది. ఒప్పంద ఉల్లంఘన, విశ్వాసరాహిత్యం, వాణిజ్య రహస్యాల గోప్యతా నిబంధనల ఉల్లంఘన, మోసాలను దాచిపెట్టడం తదితర ఆరోపణలపై ఈ కేసు వేయనుంది. ఈ కేసు వేసే బాధ్యతను కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు సి.వి.సుబ్రమణ్యంకు అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని