రైతులకు రుణాలు అందించేందుకు అదానీ క్యాపిటల్‌తో ఎస్‌బీఐ జట్టు

రైతులకు రుణాలు అందించేందుకు సహ-రుణ భాగస్వామిగా (కో-లెండింగ్‌ పార్ట్‌నర్‌) వ్యవహరించేందుకు అదానీ గ్రూప్‌నకు చెందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ అదానీ క్యాపిటల్‌తో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) జట్టు కట్టింది. అదానీ క్యాపిటల్‌ ప్రై.లి.తో మాస్టర్‌ ఒప్పందంపై ఎస్‌బీఐ సంతకం చేసింది

Updated : 03 Dec 2021 05:29 IST

దిల్లీ: రైతులకు రుణాలు అందించేందుకు సహ-రుణ భాగస్వామిగా (కో-లెండింగ్‌ పార్ట్‌నర్‌) వ్యవహరించేందుకు అదానీ గ్రూప్‌నకు చెందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ అదానీ క్యాపిటల్‌తో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) జట్టు కట్టింది. అదానీ క్యాపిటల్‌ ప్రై.లి.తో మాస్టర్‌ ఒప్పందంపై ఎస్‌బీఐ సంతకం చేసింది. ట్రాక్టర్లతో పాటు పంటల ఉత్పాదకత, కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించే వ్యవసాయ పనిముట్లను రైతులు కొనుగోలు చేసేందుకు ఈ సంస్థలు రుణాలు అందించనున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ (ఫార్మ్‌ మెకనైజేషన్‌), వేర్‌హౌస్‌ రిసీట్‌ ఫైనాన్స్‌, ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌కు (ఎఫ్‌పీఓలు) రుణాలు అందించడం ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, పలు ఎన్‌బీఎఫ్‌సీలతో జట్టు కట్టే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా వెల్లడించారు. ఉత్పాదకత పెంచి, వ్యవసాయ రంగంలో ఆదాయం అధికమయ్యేందుకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని అదానీ క్యాపిటల్‌ ఎండీ, సీఈఓ గౌరవ్‌ గుప్తా వెల్లడించారు.


ధనలక్ష్మీ బ్యాంక్‌ తాత్కాలిక ఛైర్మన్‌ సుబ్రమణియ అయ్యర్‌ రాజీనామా

దిల్లీ: వ్యక్తిగత కారణాల రీత్యా తమ బ్యాంక్‌ తాత్కాలిక ఛైర్మన్‌ జి.సుబ్రమణియ అయ్యర్‌ రాజీనామా చేసినట్లు ధనలక్ష్మీ బ్యాంక్‌ గురువారం నియంత్రణ సంస్థలకు వెల్లడించింది. 2021 డిసెంబరు 31 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని తెలిపింది. అత్యవసర, వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నానని, వేరే ఎలాంటి ఇతర కారణాలు లేవని అయ్యర్‌ తెలిపారని బ్యాంక్‌ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని